రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్... | Axis Bank reduced its lending rate by 5 basis points across all tenors | Sakshi
Sakshi News home page

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్...

Published Mon, Nov 14 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్...

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్  అంచనా...

 ముంబై: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు పెరిగిపోతుండడంతో ఈ ప్రక్రియ తర్వాత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు యాక్సిస్ బ్యాంకు తెలిపింది. సేవింగ్‌‌స, కరెంటు ఖాతాల్లో డిపాజిట్లపై బ్యాంకులకు వ్యయం చాలా తక్కువని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరగడం వల్ల నిధుల సేకరణ వ్యయం తగ్గుతుందని యాక్సిస్‌బ్యాంక్ రిటైల్ కార్యకలాపాల అధిపతి రాజీవ్ ఆనంద్ తెలిపారు. నిధుల సేకరణ వ్యయం తగ్గితే కొంత కాలానికి రుణాలపై రేట్లు కూడా దిగి వస్తాయన్నారు. ఓ నివేదిక ప్రకారం గత శుక్రవారానికి బ్యాంకుల్లో రూ.60 వేల కోట్ల నగదు డిపాజిట్ అరుుంది.

‘‘తాజా పరిణామాలతో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి డిపాజిట్లపై వ్యయం 0.03 నుంచి 0.10 శాతం వరకు తగ్గనుంది. ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బ్యాంకులు బదలారుుంచే అవకాశం ఉంది’’ అని రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. రూ.13.5 లక్షల కోట్ల రూపాయల మేర డిపాజిట్లకు అవకాశం ఉన్నప్పటికీ, నగదు మార్పిడి, రోజువారీ అవసరాలకు నగదు ఉపసంహరణలతో వాస్తవిక వృద్ధి ఆ స్థారుులో ఉండకపోవచ్చని ఇక్రా తెలిపింది. మొత్తం మీద బ్యాంకు డిపాజిట్లలో 1.3 శాతం నుంచి 3.5 శాతం మేర పెరుగుదల ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement