చలో మనీ...
• బ్యాంకుల ముందు బారులు తీరిన జనం
• పాత రూ.500..రూ.1000 నోట్ల మార్పిడి
• తొలిరోజు 40 జాతీయ బ్యాంకుల్లో రూ.1.80 కోట్ల లావాదేవీలు
• నేటి నుంచి 950 పోస్టాఫీసుల్లో కొత్త కరెన్సీ
• గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్ర సేవలు
తిరుపతి (అలిపిరి) : పెద్దనోట్ల రద్దుతో జిల్లా ప్ర జల అవస్థలు అవర్ణనాతీతంగా మారారుు. ఉదయం నుంచే ప్రజ లు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఏ బ్యాంకు చూసిన ప్రజా సందోహంతో కిక్కిరిసారుు. పాత రూ.500, వెరుు్య నోట్లు చేత పట్టుకుని బ్యాంకు ముందు పడిగాపులు కాశారు. ఒక్క గురువారం రోజున జిల్లాలోని 40 జాతీయ బ్యాంకులకు చెందిన 592 శాఖ ల్లో రూ.1.80 కోట్లు లావాదేవీ లు జరిగారుు. జిల్లాలోని 950 పోస్టాఫీస్లుల్లోనూ ప్రజ లు పాత నోట్లను మార్పు చేసుకున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంట ల వరకు లావాదేవీలు కొనసాగారుు.
లీడ్ బ్యాంక్ సమాచారం మేరకు రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు, పోస్టాపీసుల్లో గురవారం ఒక్కరోజు లావాదేవీల్లో రూ.1.80 కోట్లు మేరకు ఉంటుందని అంచనా. బ్యాంకు లు, పోసా్టీఫీసులకు వచ్చిన ప్రజలకు రూ.20,రూ.100,కొత్త రూ.2 వేల నోట్ల ను అందజేశారు. శుక్రవారం రోజున కూ డా రూ.1.80 కోట్లు లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో రూ.800 నుంచి రూ.1200 కోట్ల లావాదేవీలు జరగనున్నట్లు లీడ్ బ్యాంక్ అంచ నా వేస్తోంది. శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు అందుబాటులో ఉంటాయ న్న సమాచారంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఒక వ్యక్తికి రూ.4 వేల వంతున జిల్లాలోని 950 పోస్టాఫీసుల్లో శుక్రవారం నుంచి ప్రజల కు కరెన్సీని అందజేయనున్నారు.
నేటి నుంచి బ్యాంకు మిత్రల సేవలు
గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుం డా జిల్లాలోని గ్రామాల్లో బ్యాంకు మి త్రలు సేవలందించనున్నారు. 739 మం ది బ్యాంకు మిత్రలు గ్రామీణ ప్రజలకు అవసరమైన నగదు మార్పిడికి సహకరిం చనున్నారు. చిన్న మొత్తంలో పాత నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
నేటి నుంచి అందుబాటులో ఏటీఎంలు
పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల చుట్టూ ప్ర దక్షిణలు చేస్తున్న ప్రజలకు శుక్రవారం నుంచి కాస్త ఊరట లభించనుంది. ఏటీఎంలను బ్యాంకు యాజమాన్యాలు అం దుబాటులోకి రానున్నారుు. రూ.100 నో ట్లు ఏటీఎం ద్వారా ప్రజలు పొందే వెసులుబాటును కల్పించారు.
ప్రజలకు అందుబాటులో కొత్తనోట్లు
కొత్త రూ.2వేల నోట్లు శుక్రవారం నుంచి ప్రజలకు పూర్తిస్థారుులో అందుబాటులోకి వస్తాయని లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్‌రావు తెలిపారు. ఏటీఎం లు పునఃప్రారంభిస్తుండడంతో బ్యాంకు ల్లో ప్రజల రద్దీ తగ్గే అవకాశం ఉం దన్నా రు. వ్యక్తిగత గుర్తింపు కార్డుతో ఒక వ్యక్తి రూ.4 వేలు తీసుకునే వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. మరో రెండు రో జులు కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు.
నేటి నుంచి పోస్టాఫీసుల్లో పెద్ద నోట్ల మార్పిడి
జిల్లాలోని హెడ్, సబ్‌పోస్టాఫీసుల్లో శుక్రవా రం నుంచి పాత రూ.500, వెరుు్య నోట్లను రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం కల్పించారు. తిరుపతి పోస్టల్ డివిజన్ పరిధిలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరిలో హెడ్‌పోస్టాఫీసులున్నా రుు. వీటి పరిధిలో మొత్తం 396 బ్రాంచ్ పోస్టాఫీసులు, 69 సబ్ పోస్టాఫీసులున్నా రుు. చిత్తూరు పోస్టల్ డివిజన్ పరిధిలో పలమనేరు, మదనపల్లి, చిత్తూరులో హెడ్‌పోస్టాఫీసులున్నారుు. వీటి పరిధిలో 543 బ్రాంచ్ పోస్టాఫీసులు, 52 సబ్‌పోస్టాఫీసులున్నారుు. వీటిలో పాత నోట్ల మార్పిడి అ వకాశం కల్పించారు. అలాగే అన్ని పోస్టాఫీ సు స్కీములు, పథకాల ద్వారా జమ చేసుకునే లావాదేవీలు బ్యాంకు నిబంధనల మే రకే ఉంటారుు. అలాగే నగదు విత్‌డ్రా సౌకర్యాన్ని రోజుకు రూ.10వేలు, వారానికి రూ. 20 వేలుగా నిర్ణరుుంచారు. పోస్టల్ ఏటీఎంల ద్వారా రోజుకు రూ. 2వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.
శని, ఆదివారాలు బ్యాంకు పనిదినాలు
చిత్తూరు ఎడ్యుకేషన్ : శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవులు అరుునప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకులు పనిచేస్తాయని జిల్లా జారుుంట్ కలెక్టర్ గిరీషా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకు అధికారులు, పోలీసుల అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఆయన మాట్లాడుతూ రూ.500, వెరుు్య నోట్ల రద్దుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నగదు మార్పిడికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకుల్లో ఒక్కొక్క వ్యక్తి రూ.4వేలను ఈనెల 24వ తేదీ లోపు జమ చేసి వంద రూపాయాల నోట్లను పొందవచ్చన్నారు. ఎల్‌డీఎం రామ్మోహన్‌రావు, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇబ్బందులు ఎదురైతే తెలపండి
జిల్లాలోని బ్యాంకుల్లో రూ.500, వెరుు్య నోట్లను జమ చేసేం దుకు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తమకు తెలియజేయవచ్చని జారుుంట్ కలెక్టర్ గిరీషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలు తెలపడానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ 94906 90275, వాట్సాప్ నంబర్ 96526 16786, జిల్లా కలెక్టరేట్ వాట్సాప్ నంబర్ 99850 77584, కంట్రోల్ రూమ్ నంబర్ 08572 - 240500లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు.