డిసెంబర్ 30తో గడువు ముగియడం™ రద్దయిన కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలు తెలపాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.
న్యూఢిల్లీ: డిసెంబర్ 30తో గడువు ముగియడం రద్దయిన కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలు తెలపాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. శుక్రవారం బ్యాంకు పనివేళలు ముగిశాక వివరాలు పంపే పని ప్రారంభించాలంది. ‘రద్దయిన నోట్ల మార్పిడి, డిపాజిట్లకు గడువు ముగియడంతో డిసెంబర్ 30, 2016 నాటికి ఎంత పాత కరెన్సీ చేరిందో ఈ మెయిల్ ద్వారా తెలపాలి’ అని కోరింది.
డీసీసీబీలు తప్పించి అన్ని బ్యాంకు శాఖలు... గడువు ముగిసే నాటికి తమ వద్ద ఉన్న పాత నోట్లను ఆర్‌బీఐ కేంద్రాల్లో, కరెన్సీ చెస్ట్‌ల్లో శనివారం కల్లా డిపాజిట్ చేయాలంది.