
ఎంత డిపాజిట్ చేస్తే అంత విత్‌డ్రా
చెల్లుబాటు కరెన్సీకి నేటి నుంచి పరిమితి వర్తించదన్న ఆర్‌బీఐ
ముంబై: చెల్లుబాటయ్యే కరెన్సీ నోట్లు ఎంత డిపాజిట్ చేస్తే అంత మొత్తం ఖాతా నుంచి తిరిగి విత్‌డ్రా చేసుకోవచ్చని, వాటిపై వారానికి 24 వేల పరిమితి వర్తించదని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. నవంబర్ 29 నుంచి ఎవరైనా ప్రస్తుతం చెల్లుబాటయ్యే కరెన్సీ(రూ. 2000, 500, 100, 50, 20, 10, 5) రూపంలో రూ. 4 వేలు డిపాజిట్ చేస్తే అతని విత్‌డ్రా పరిమితి ప్రస్తుత లిమిట్(వారానికి రూ. 24 వేలు)కి అదనంగా మరో 4 వేలు పెరుగుతుంది.
చెల్లుబాటు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రస్తుతమున్న విత్‌డ్రా గరిష్ట పరిమితి దృష్ట్యా చాలామంది ఖాతాదారులు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతున్నారని పేర్కొంది. అరుుతే విత్‌డ్రా చేసుకునే నగదుకు రూ. 2 వేలు, రూ. 500 నోట్లు ఇవ్వవచ్చని తెలిపింది.