బంగారం రూపంలోనూ డిపాజిట్లు వెనక్కు : కేంద్రం
న్యూఢిల్లీ: గోల్డ్ మానిటైజే షన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా అందులో కొన్ని సవరణలు చేసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభుత్వ స్కీముల్లో డిపాజిట్ చేసిన బంగారాన్ని ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ సమయంలో నగదు రూపంలో గానీ బంగారం రూపంలో గానీ వెనక్కు తీసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే డిపాజిట్లపై వచ్చే వడ్డీని మాత్రం నగదుగానే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్వెస్టర్లు బంగారం రూపంలో డిపాజిట్లను తీసుకుంటే వారి నుంచి ప్రభుత్వం 0.2 శాతం అడ్మినిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయనున్నది. ప్రభుత్వపు తాజా సవరణ ప్రధానంగా దేవాలయ ట్రస్టులకు ఉపయుక్తంగా మారనున్నది. దేశంలోని దేవాలయాల్లో అధిక మొత్తంలో బంగారం ఉన్న విషయం తెలిసిందే.