
సెల్‌ఫోన్ ఆశచూపి నగదు చోరీ
నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని అందులో పనిచేస్తున్న ఉద్యోగినని చెప్పి ఓ వ్యక్తి మోసగించాడు.
- బ్యాంకు ఉద్యోగినని నమ్మించి ఇంటర్ విద్యార్థిని బురిడీ కొట్టించిన మోసగాడు
- ఉయ్యూరులోని ఓ జాతీయ బ్యాంక్ బ్రాంచ్‌లో ఘటన
ఉయ్యూరు : నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని అందులో పనిచేస్తున్న ఉద్యోగినని చెప్పి ఓ వ్యక్తి మోసగించాడు. పట్టణంలోని ఓ జాతీ య బ్యాంక్ బ్రాంచ్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన స్థాని కంగా కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. పమిడిముక్కల మండలం గురజాడ గ్రామానికి చెందిన శొంఠి రంగారావు ఉయ్యూరు కూరగాయల మార్కెట్‌లో ఓ వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు.
రంగారావు బుధవారం తన కుమారుడు రవితేజ(ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి)కు రూ.14,200 ఇచ్చి, బ్యాంక్‌లో డిపాజిట్ చేసేం దుకు పంపాడు. రవితేజ బ్యాంక్‌కు వచ్చి వోచర్ పూర్తి చేస్తుండగా ఓ వ్యక్తి అతడి వద్దకు వచ్చాడు. ‘‘ఏమ్మా.. ఏం చదువుతున్నావు.. బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తున్నావ్.. ఏ నోట్లు తెచ్చావ్..’’ అంటూ పలకరించాడు. ‘అంకుల్.. ఇంతకీ మీరెవరు?’ అని రవితేజ ప్రశ్నించా డు. ‘నేను బ్యాంక్‌లో ఉద్యోగినమ్మా.. 3వ క్యాష్ కౌంటర్ లో ఉంటా. బ్యాంకు కొత్తగా స్కీం ప్రవేశపెట్టింది. ఖాతాదారులకు సెల్‌ఫోన్ ఇస్తున్నాం.
నీవు కూడా పాస్‌బుక్ జిరాక్స్ కాపీ నాకు తెచ్చి ఇస్తే సెల్‌ఫోన్ ఇస్తా’ అని చెప్పాడు. రవితేజ ఆ మాటలు నమ్మి వోచర్, డబ్బును ఆ వ్యక్తికి ఇచ్చి పాస్‌బుక్ జిరాక్స్ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత రవితేజ వచ్చి చూడగా ఆ వ్యక్తి కనిపించలేదు. దీంతో బాలుడు మార్కెట్‌కు వెళ్లి జరిగిన మోసం గురించి తండ్రికి చెప్పాడు. ఆయన కుమారుడితో కలిసి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘట నపై ఫిర్యాదు చేశాడు. వారు బ్యాంక్‌కు వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. విద్యార్థిని మోసం చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.