సాక్షి, ముంబై : బ్యాంక్ ఖాతాలను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా శనివారం మరోమారు స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక లావాదేవీలను నియంత్రించే క్రమంలో బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదంటూ వస్తున్న కథనాలను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా మనీ లాండరింగ్ నిరోధక చట్టం - 2017 ప్రకారం ఇది తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది. డిపెంబర్ 31 లోగా ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం - 2017ను అనుసరించి అన్ని బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా.. అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment