న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఈ మైలురాయి నమోదైంది. ఇందులో 56 శాతం ఖాతాలు మహిళల పేరిట ప్రారంభమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం జన్‌ధన్ ఖాతాల్లో 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి ఉన్నట్టు పేర్కొంది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా అందించినట్టు తెలిపింది.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఒక్కో ఖాతాలో సగటు బ్యాలన్స్ రూ.4,076గా ఉందని.. 5.5 కోట్ల ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు అందుకుంటున్నట్టు వెల్లడించింది. 2014 ఆగస్ట్ 28న ఈ పథకం ప్రారంభం కావడం గమనార్హం. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ నిర్వించాల్సిన అవసరం ఉండదు. రూ.2 లక్షల ప్రమాద మరణ బీమాతో కూడిన రూపే కార్డు ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఖాతా నుంచి రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment