ముంబై: డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్ట సవరణ ప్రకారం 90 రోజుల్లోపు రూ. 5,00,000 చెల్లింపులకు అర్హత కలిగిన ఖాతా దారుల జాబితాను రూపొందించాలని మారటోరియంలో ఉన్న 21 సహకార బ్యాంకులను డీఐసీజీసీ ఆదేశించింది.
అక్టోబర్ 15లోపు క్లయిమ్ జాబితా సిద్ధం కావాలని స్పష్టం చేసింది. దీనిలో పీఎంసీ బ్యాంక్ కూడా ఒకటి. మారటోరియంలో ఉన్న 21 బ్యాంకుల్లో 11 మహారాష్ట్రవికాగా, ఐదు కర్ణాటక రాష్ట్రానికి చెందినవి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, రాజస్తాన్‌లకు చెందిన ఒక్కొక్క బ్యాంక్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment