అనంతపురం ఎడ్యుకేషన్ : 2014, 2015 సంవత్సరాల్లో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్పు (ఎన్‌ఎంఎంఎస్)కు ఎంపికైన, 9, 10 తరగతుల విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలని డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11లోగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలని, లేదంటే వారికి స్కాలర్‌షిప్పు మంజూరుకాదని వివరించారు.