
గడచిన దశాబ్దకాలం మహిళకు ఒక టర్నింగ్ ఎరాగా నిలిచింది. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే అమెరికా యూనివర్సిటీల్లో కూడా అమ్మాయిలు తక్కువగా ఉండేవారు. గత పదేళ్లుగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2009 నుంచి మొదలైన పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది.
రాజ్యాంగ ప్రవేశికలో..
న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగా అవకాశాలు, గౌరవమర్యాదలు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటాయి అని రాజ్యాంగ ప్రవేశిక చెప్తోంది. అంటే మహిళలు, మగవాళ్లు అనే తేడా రాజ్యాంగంలో చెప్పడం లేదు. మరి సమాజంలో ఈ అంతరం ఎందుకు ?
అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే, పెద్దయ్యాక ఎమోషనల్‌గా ఖర్చు చేయరు. ‘ఆడవాళ్లకు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చేతకాదు’ అనే అపోహను తుడిచివేయవచ్చు. ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకోబోయే వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కౌన్సెలింగ్ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణ తలెత్తకుండా ఎవరి స్వాతంత్య్రాన్ని వాళ్లు కాపాడుకుంటూ సాధికారతను నిలబెట్టుకోవడం నేర్పిస్తారు.
మహిళల బ్యాంకు అకౌంట్‌లు గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నాయి. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ముద్రా రుణాలను నేరుగా బ్యాంకు అకౌంట్‌లోనే జమ చేయడం, ఉపాధి హామీ పథకాల డబ్బును కూడా అకౌంట్‌లోనే జమ చేయడం వంటి నిర్ణయాలతో అకౌంట్‌లు యాక్టివ్‌గా ఉంటున్నాయి.
ఉమెన్ ఎంపవర్‌మెంట్ అంటే?
- మహిళలకు తమ శక్తిసామర్థ్యాల మీద అవగాహన కల్పించడం
- తమకు ఇష్టమైన రంగాలను గుర్తించగలగడం, వాటిని కెరీర్‌గా ఎంచుకునే హక్కు కలిగి ఉండడం
- సమాన అవకాశాలు పొందడానికి ఉన్న దారులను తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం
- తమ మీద, తమ జీవితం మీద సంపూర్ణ అధికారం తమదే అనే స్పృహ మహిళలో కలిగించడం, దానిని నియంత్రించుకోగలిగిన శక్తిని, సంపాదించుకునే హక్కు కలిగి ఉండడం
- ఆర్థిక అంశాలతోపాటు సమాజానికి మరింత ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చేటట్లు శక్తి పెంపొందించడం(ఇవి... మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి సూచించిన సూత్రాలు)
358 మిలియన్ల భారతీయ మహిళలకు బ్యాంకు అకౌంట్‌లున్నాయి.గతంలో అకౌంట్ ఉన్నప్పటికీ చాలా వరకు లావాదేవీలు జరిగేవి కాదు. ఇప్పుడు యాక్టివ్ అకౌంట్‌లు 29 నుంచి 42 శాతానికి పెరిగాయి.
కెన్యా, టాంజానియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియాలతో పోలిస్తే భారతీయ మహిళలు చాలా ముందున్నారు.
మహిళా బ్యాంకుల ఏర్పాటు ఒక విప్లవం. జార్ఖండ్‌లో 10 మహిళా బ్యాంకుల స్థాపన వల్ల 32,000 మంది మహిళలు బ్యాంకు లావాదేవీలతో అనుసంధానమయ్యారు. వారిలో 17,000మంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ లబ్ధిదారులు.
పిఎమ్‌జెడివై (ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన) పథకంలో ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్‌లలో ఎక్కువ భాగం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలకు బ్యాంకు ఖాతాలు పెరగడానికి అది కూడా ఓ కారణం. ఓపెన్ అయిన అకౌంట్‌లను నిరర్థకంగా వదిలేయకుండా లావాదేవీలు నిర్వహించడం మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక చైతన్యానికి సూచిక.
Comments
Please login to add a commentAdd a comment