Women banks
-
రూ.కోట్లు మింగిన ‘క్యామెల్’
సూళ్లూరుపేట/సూళ్లూరుపేట రూరల్: టీడీపీ నాయకురాలు, సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్, క్యామెల్ మహిళా కో–ఆపరేటివ్ మహిళా బ్యాంక్ అధినేత గరిక ఈశ్వరమ్మ ఆర్థిక నేరంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాబార్డు, సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి పలురకాలుగా మొత్తం రూ.9.21 కోట్ల రుణంను ఈశ్వరమ్మ పొందింది. అయితే తిరిగి రూ.7.08 కోట్లు చెల్లించకపోవడంతో సూళ్లూరుపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నాబార్డు అనుబంధ సంస్థ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులు సుధాభారతి, శేఖర్‌బాబులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. బ్యాంక్ అధికారులు నేరుగా ఎస్పీని కలిసి వివరాలు తెలియజేసి ఆయన సూచన మేరకు సూళ్లూరుపేటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈశ్వరమ్మ అధికార పార్టీ నాయకురాలైనా వెంటనే కేసు నమోదైంది. మంగళవారం రాత్రి ఎస్సై సూళ్లూరుపేటలోని క్యామెల్ సేవా సంస్థ కార్యాలయానికి వెళ్లి ఈశ్వరమ్మ, మహిళా బ్యాంకు అధ్యక్షురాలు వనితలను అరెస్ట్ చేశారు. పరసా జోక్యంతో.. మంగళవారం రాత్రి ఈశ్వరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరసా వెంటరత్నం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఆమెను వెంటనే విడుదల చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై ఈశ్వరమ్మకు ఒక మహిళా హోంగార్డును కాపలాగా ఇచ్చి పంపించారు. తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఈశ్వరమ్మ బుధవారం సాయంత్రమైనా రాకపోవడంతో ఎస్సై వాకబు చేసి పరారైనట్టు నిర్ధారించుకున్నారు. కాగా నిందితురాలు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. క్యామెల్‌తోనే మొదలైన ప్రస్థానం ఈశ్వరమ్మ భర్త ఈశ్వరయ్య తొలుత మునెమ్మ అనే మహిళతో కలసి క్యామెల్ సేవాసంస్థను ఏర్పాటుచేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద సంస్థ నమోదయ్యాక దానికి విదేశీ నిధులు రావడం మొదలైంది. దీంతో ఈశ్వరయ్య చిత్తూరు జిల్లాలోని మేర్లపాక గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను పెళ్లాడి సంస్థను ఆమె చేతుల్లో పెట్టాడు. సునామీ రావడం, పలు కార్యక్రమాల కోసం విదేశీ నిధులు ఇబ్బడిముబ్మడిగా రావడంతో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంది. అప్పుడే ఈశ్వరమ్మ మహిళా బ్యాంక్‌ను స్థాపించి గ్రామాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుచేసింది. మొదలైన అక్రమాలు క్యామెల్ మహిళా బ్యాంక్ ప్రత్యేకంగా ఇచ్చే పొదుపు రుణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. గ్రూపులకు రుణం ఇచ్చినట్లు రికార్డు చేసి అందులో సగం మాత్రమే దోచినట్లు సహకార సంఘ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారు బాధిత సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించి పోలీసులకు ఫిర్యాదు చే శా రు. ఇదిలా ఉండగా ఎస్బీఐ వారు ఇది వరకే మహిళా బ్యాంక్‌కు నోటీసులు ఇవ్వడంతో ఈశ్వర మ్మ కొంతమేర ఆస్తులను సదరు బ్యాంక్‌కు అ టాచ్ చేసినట్లు తెలిసింది. అయితే నాబార్డుకు ఎ లాంటి చెల్లింపులు జరగకపోవడంతో దాని అనుబంధ సంస్థ సహకార బ్యాంకు పోలీసులకు ఫి ర్యాదు చేసింది. ఇదిలాఉండగా ఈశ్వరమ్మ బ్యాం కుల నుంచి తీసుకున్న రుణం సొమ్ము చాలావరకు రియల్ఎస్టేట్ వ్యాపారంలో వెచ్చించి తీ వ్రంగా నష్టపోయినట్లు పలువురు చెబుతున్నారు. టీడీపీలో చేరి.. సూళ్లూరుపేటలో క్యామెల్ ఒక సేవా సంస్థ నుంచి రాజకీయ వ్యవస్థగా మారింది. 2009లో ఈశ్వరమ్మ ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీ సీటు తెచ్చుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి 35 వేల ఓట్లు సాధించింది. ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వాకాటి నారాయణరెడ్డి గ్రూపులో స్థిరపడింది. ఆ పార్టీలో నుంచే సూళ్లూరుపేట పురపాలకానికి చైర్మన్ పదవికి పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఈశ్వరమ్మను పురపాలకానికి ఉపాధ్యక్షురాలైంది. తర్వాత ఆమె వాకాటితో కలసి టీడీపీలో చేరింది. వ్యక్తిగత మరుగుదొడ్ల సొమ్మును కూడా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా ఆమెకు అనుకూలమైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నప్పటికి అసలు నిందితురాలు పరారీలో ఉండటంతో కేసు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. -
అమ్మాయిలదే అగ్రస్థానం!
గడచిన దశాబ్దకాలం మహిళకు ఒక టర్నింగ్ ఎరాగా నిలిచింది. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే అమెరికా యూనివర్సిటీల్లో కూడా అమ్మాయిలు తక్కువగా ఉండేవారు. గత పదేళ్లుగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2009 నుంచి మొదలైన పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. రాజ్యాంగ ప్రవేశికలో.. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగా అవకాశాలు, గౌరవమర్యాదలు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటాయి అని రాజ్యాంగ ప్రవేశిక చెప్తోంది. అంటే మహిళలు, మగవాళ్లు అనే తేడా రాజ్యాంగంలో చెప్పడం లేదు. మరి సమాజంలో ఈ అంతరం ఎందుకు ? అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే, పెద్దయ్యాక ఎమోషనల్‌గా ఖర్చు చేయరు. ‘ఆడవాళ్లకు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చేతకాదు’ అనే అపోహను తుడిచివేయవచ్చు. ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకోబోయే వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కౌన్సెలింగ్ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణ తలెత్తకుండా ఎవరి స్వాతంత్య్రాన్ని వాళ్లు కాపాడుకుంటూ సాధికారతను నిలబెట్టుకోవడం నేర్పిస్తారు. మహిళల బ్యాంకు అకౌంట్లు గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నాయి. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ముద్రా రుణాలను నేరుగా బ్యాంకు అకౌంట్లోనే జమ చేయడం, ఉపాధి హామీ పథకాల డబ్బును కూడా అకౌంట్లోనే జమ చేయడం వంటి నిర్ణయాలతో అకౌంట్లు యాక్టివ్‌గా ఉంటున్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే? - మహిళలకు తమ శక్తిసామర్థ్యాల మీద అవగాహన కల్పించడం - తమకు ఇష్టమైన రంగాలను గుర్తించగలగడం, వాటిని కెరీర్‌గా ఎంచుకునే హక్కు కలిగి ఉండడం - సమాన అవకాశాలు పొందడానికి ఉన్న దారులను తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం - తమ మీద, తమ జీవితం మీద సంపూర్ణ అధికారం తమదే అనే స్పృహ మహిళలో కలిగించడం, దానిని నియంత్రించుకోగలిగిన శక్తిని, సంపాదించుకునే హక్కు కలిగి ఉండడం - ఆర్థిక అంశాలతోపాటు సమాజానికి మరింత ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చేటట్లు శక్తి పెంపొందించడం(ఇవి... మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి సూచించిన సూత్రాలు) 358 మిలియన్ల భారతీయ మహిళలకు బ్యాంకు అకౌంట్లున్నాయి.గతంలో అకౌంట్ ఉన్నప్పటికీ చాలా వరకు లావాదేవీలు జరిగేవి కాదు. ఇప్పుడు యాక్టివ్ అకౌంట్లు 29 నుంచి 42 శాతానికి పెరిగాయి. కెన్యా, టాంజానియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియాలతో పోలిస్తే భారతీయ మహిళలు చాలా ముందున్నారు. మహిళా బ్యాంకుల ఏర్పాటు ఒక విప్లవం. జార్ఖండ్‌లో 10 మహిళా బ్యాంకుల స్థాపన వల్ల 32,000 మంది మహిళలు బ్యాంకు లావాదేవీలతో అనుసంధానమయ్యారు. వారిలో 17,000మంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ లబ్ధిదారులు. పిఎమ్‌జెడివై (ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన) పథకంలో ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్లలో ఎక్కువ భాగం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలకు బ్యాంకు ఖాతాలు పెరగడానికి అది కూడా ఓ కారణం. ఓపెన్ అయిన అకౌంట్లను నిరర్థకంగా వదిలేయకుండా లావాదేవీలు నిర్వహించడం మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక చైతన్యానికి సూచిక. -
గింజలు లేని ఎసరేనా?
సాక్షి, రాజమండ్రి : ‘రుణాలు కట్టొదు. రద్దు చేస్తామని హామీ ఇచ్చి మా కొంపలు ముంచారు. మాఫీ ఎలా అమలవుతుందో నేటికీ అయోమయమే. కానీ బ్యాంకోళ్లు మాత్రం బకాయిలు కట్టక పోతే గ్రూపులకు ఇంక ముందు లోను ఇచ్చేది లేదంటున్నారు. వడ్డీలతో బకాయిలు కట్టాలంటే మా తలతాకట్టు పెట్టినా చాలదు’ రెండు రోజులుగా జిల్లాలోని డ్వాక్రా మహిళల ఆక్రోశం ఇది. ‘లేని పోని ఆశలు కల్పించారు. అమలు మాత్రం అరకొరగా చేస్తున్నారు. ఇదంతా అధికారం చేసి ఆడిన నాటకం, నమ్మకద్రోహం!’ ఆ మహిళల ఆగ్రహం ఇది. బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాల వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సుమారు 30 వేల మహిళా సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5,900 సంఘాలకు సుమారు రూ.190 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు అందాయి. వీరి పరిస్థితి తాజా పరిణామాల నేపథ్యంలో అయోమయంలో పడింది. బ్యాంకు అధికారులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో తిరుగుతూ సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోకలిసి సమావేశాలు పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉండే డ్వాక్రా సంఘాల బకాయిల చిట్టాలు చూపిస్తున్నారు. చెల్లించాల్సిన అప్పు ఎంత, అందుకు గాను చెల్లించాల్సిన వడ్డీ ఎంత, వడ్డీ, అసలు కలిపితే ఎంత అంటూ లెక్కలు చెబుతున్నారు. ‘మీరు ఈ నెల అంటే సెప్టెంబర్ మొదటి వారంలో పాత బాకీని వడ్డీతో సహా చెల్లించాలి. లేదంటే గ్రూపు గుర్తింపు రద్దు చేస్తా’మని హెచ్చరిస్తున్నారు. ‘ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించింది కదా’ అంటే మాఫీ ప్రకటించినా అప్పులు కట్టాల్సిందేనంటున్నారు. ‘ప్రభుత్వం మాఫీ చెల్లింపులు ప్రారంభిస్తే అప్పుడు చూద్దాం. ముందు బకాయిలు కట్టాల్సిందే’ అని హుకుం జారీ చేస్తున్నారు. భారం చెంబుడయ్యాక చెంచాడు మాఫీ! రాజమండ్రి అర్బన్‌లోని లలితా మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.మూడు లక్షల రుణం తీసుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మాఫీ వాగ్దానం చేయడంతో అప్పటి నుంచీ రుణవాయిదాలు కట్టడం మానేశారు. ఇప్పుడు మూడు నెలలు బకాయి పడడంతో నెల వాయిదా రూ.15 వేల చొప్పున రూ.45 వేలు; నెలకు రూ.5 వేల వడ్డీ చొప్పున రూ.15 వేలు.. మొత్తం రూ.60 వేలు కట్టాలని బ్యాంకు అధికారులు లెక్క చెబుతున్నారు. బకాయి పడ్డందుకు పావలా వడ్డీ వర్తించదని, పూర్తి వడ్డీ చెల్లించాల్సిందేనని ఖండితంగా చెప్పడంతో సభ్యులు అవాక్కయ్యారు. మాఫీతో రుణభారం విరగడవుతుందని ఆశపడ్డ ఈ మహిళలు ఇప్పుడు.. మొదటికే మోసం వస్తుందేమో అని భయపడుతున్నారు. తమను డిఫాల్టర్లుగా చిత్రీకరించి రుణమాఫీకి అనర్హులుగా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బకాయిలు, వడ్డీల భారం చెంబుడు అయ్యాక.. చెంచాడు మాఫీ సాయం అందించి సర్కారు తమను వెర్రివాళ్లను చేస్తుందేమోనని దిగాలు పడుతున్నారు. -
మహిళల కోసం ప్రత్యేక బ్యాంకులు