సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను జాతీయం చేసినా మోదీ ప్రభు త్వం వచ్చిన తర్వాతనే కోట్లాది మంది పేదలకు బ్యాంకు ఖాతాలు సమకూరాయని బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్‌చార్జి పురందేశ్వరి అన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు 32 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతా లు వచ్చాయని, ఇది మోదీ సాధించిన పెద్ద విజయమని అభివర్ణించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జన్‌ధన్ పథకంతో అనేక మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారని చెప్పారు.
తెలంగాణలో నియంతృత్వం: కె.లక్ష్మణ్
కేంద్రంలో మోదీ పాలనకు, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఎక్కడా పోలికే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో నియంతృత్వపాలన సాగుతోందన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదన్నారు. ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో అంటకాగు తున్నారని విమర్శించారు.
ఈ నెలలో నిర్వ హించే జనచైతన్య యాత్రలో టీఆర్‌ఎస్ విధానాలను ఎండగడతామన్నారు. అనంతరం తెలుగు యువత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాజె రమేశ్, బీసీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్ బీజేపీలో చేరారు. వీరికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ, పార్టీ కార్యదర్శి గౌరి, మహిళామోర్చా నేతలు సరళ, నాగపరిమళ, ఎస్సీమోర్చా నేత శ్రుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment