సాక్షి, న్యూఢిల్లీ : బ్లాక్‌మనీ హోల్డర్స్‌పై కొరడా ఝళిపిస్తూ వెళ్తున్న ఆదాయపు పన్ను శాఖ అథారిటీలు తాజాగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను టార్గెట్ చేశారు. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు కలిగిన వారికి విచారణ నోటీసులు పంపుతున్నారు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ కింద అమెరికా, భారత్‌తో వీరి సమాచారాన్ని షేర్ చేస్తోంది. ఈ లేఖలు అందిన వారిలో బహుళ జాతీయ కంపెన్లీ పనిచేస్తూ కొన్ని ఏళ్ల క్రితం భారత్‌కు వచ్చిన టాప్-ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌లున్నారు.
అమెరికా బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డివిడెంట్లపై వివరణ ఇవ్వాలని వీరిని, ఆదాయపు పన్ను శాఖ ఆదేశిస్తోంది. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు మాత్రమే కాక, ఫైనాన్సియల్‌గా కలిగి ఉన్న వాటిపై కూడా వివరణ ఇవ్వాలని కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు పంపింది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా 2015 సెప్టెంబర్ నుంచే భారత్, అమెరికాతో సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించింది.
ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ పంపుతున్న నోటీసుల్లో బ్యాంకు అకౌంట్‌లో కలిగి ఉన్న డివిడెండ్‌లు, ఆదాయంపై వడ్డీ, ఇతర డిపాజిట్లపై సమాచారం కోరుతున్నట్టు తెలిసింది. అయితే ఎంతమందికి ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపిందో తెలియదు. విదేశాల్లో సంపదను కలిగి ఉండి, వాటిని దాచిపెడితే లెక్కల్లో చూపని విదేశీ ఆదాయం, ఆస్తుల యాక్ట్ కింద 10 ఏళ్ల వరకు కఠిన శిక్ష ఉంటుంది. 120 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా పొందిన సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాథమికంగా ఫిల్డర్‌చేసి, ప్రాసెస్ చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment