ఠంఛన్‌గా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పింఛన్ డబ్బులు పంపిణీ చేసింది. వలంటీర్లు లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి 49,32,936 మందికి రూ.1,359.35 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు.
సాక్షి, అమరావతి: ఠంఛన్‌గా ఒకటో తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు ప్రభుత్వం పంపిణీ చేసింది. బుధవారం తెల్లవారు జాము నుంచే వలంటీర్లు లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి సాయంత్రం వరకు 49,32,936 మందికి రూ.1,359.35 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు.
నవంబర్‌లో మొత్తం 65.54 లక్షల మందికి పింఛన్ల పంపిణీ గాను రూ.1806.90 కోట్లను ప్రభుత్వం మంగళవారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 75.26 శాతం మందికి బుధవారమే పింఛన్ల పంపిణీ పూర్తి కాగా, మిగిలిన వారి కోసం ఈ నెల ఐదో తేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్దిదారు ఇంటి వద్దనే పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment