సిబ్బంది పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి నగదు జమ చేసిన కళాశాల యాజమాన్యం
విజయవాడ (వన్‌టౌన్): విజయవాడలో నోట్ల మార్పిడికి సంబంధించి మరో ఉదంతం వెలుగుచూసింది. విజయవాడ పాతబస్తీలోని గాంధీజీ మహిళా కళాశాల యాజమాన్యం ఆ కళాశాలలో పని చేస్తున్న 29 మంది సిబ్బందికి ఈ నెల 10న స్థానిక తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో కొత్త ఖాతాలను తెరిపించింది. అప్పటికే అదే బ్యాంకులో కళాశాలకు చెందిన మరో 14 మందికి ఖాతాలు ఉన్నారుు. ఈ మొత్తం ఖాతాల్లో రూ.12 లక్షలు కళాశాల యాజమాన్యం డిపాజిట్ చేసింది. ఒక్కొక్క ఖాతాలో రూ. 20 నుంచి రూ.48 వేల వరకూ డిపా జిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందులో సుమారు ఆరు లక్షల వరకూ విత్‌డ్రాలు జరిగాయి. అయితే ఈ అంశంలో కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గుణదలకు చెందిన కడియం జూడీ అనే మహిళ తన వద్ద బలవంతంగా ఖాళీ డిపాజిట్, విత్‌డ్రా ఫారాలపై సంతకాలు తీసుకొని తనకు తెలియకుండా తన ఖాతాలో నగదు డిపాజిట్ చేశారని సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బ్యాంకు ఖాతాలు, కళాశాల ఆర్థిక లావాదేవీల పుస్తకాలను పరిశీలించేందుకు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా 43 మంది సిబ్బందిని, బ్యాంకు అధికారులను మంగళవారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీనిపై డీసీపీ పాలరాజు మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని చెప్పారు.
బెజవాడలో నోట్ల మార్పిడి ఉదంతం
Published Wed, Nov 30 2016 1:39 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement