
ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు మాయం
హైదరాబాద్ : నగరంలోని పికెట్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు మాయమైన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. బ్యాంకులోని మొత్తం 19 మంది ఖాతాదారుల నుంచి సుమారు రూ. 7 లక్షల నగదు మాయమైంది. ఆ విషయం గమనించిన ఖాతాదారులు బ్యాంక్కు చేరుకుని ఆందోళనకు దిగారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి... ఖాతాదారులకు నగదు అందేలా చర్యలు తీసుకుంటానని బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే తంతూ నగరంలోని మరికొన్ని బ్యాంకుల్లో కూడా జరిగినట్లు సమాచారం. అయితే ముంబైకి చెందిన కొంతమంది దుండగులు ఏటీఎమ్ క్లోనింగ్ల ద్వారా ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.