Rs. 7 lakhs
-
పెంబర్తి చెక్‌పోస్టులో రూ.7 లక్షలు స్వాధీనం
జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్ట్ పోలీసులు శనివారం ఓ కారులో తరలిస్తున్న రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తుమ్మల కీర్తివర్ధన్రెడ్డి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి వెళుతుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద రూ.7 లక్షలను గుర్తించారు. నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మాటూరు గ్రామంలో భూమి కొనుగోలుకు సంబంధించి ఈ డబ్బులు తీసుకెళుతున్నట్టు కీర్తివర్ధన్రెడ్డి చెప్పగా, అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఖాతాల నుంచి రూ. 7 లక్షలు మాయం
-
ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు మాయం
హైదరాబాద్ : నగరంలోని పికెట్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు మాయమైన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. బ్యాంకులోని మొత్తం 19 మంది ఖాతాదారుల నుంచి సుమారు రూ. 7 లక్షల నగదు మాయమైంది. ఆ విషయం గమనించిన ఖాతాదారులు బ్యాంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి... ఖాతాదారులకు నగదు అందేలా చర్యలు తీసుకుంటానని బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే తంతూ నగరంలోని మరికొన్ని బ్యాంకుల్లో కూడా జరిగినట్లు సమాచారం. అయితే ముంబైకి చెందిన కొంతమంది దుండగులు ఏటీఎమ్ క్లోనింగ్ల ద్వారా ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.