జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్ట్ పోలీసులు శనివారం ఓ కారులో తరలిస్తున్న రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తుమ్మల కీర్తివర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి వెళుతుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద రూ.7 లక్షలను గుర్తించారు. నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మాటూరు గ్రామంలో భూమి కొనుగోలుకు సంబంధించి ఈ డబ్బులు తీసుకెళుతున్నట్టు కీర్తివర్ధన్‌రెడ్డి చెప్పగా, అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
పెంబర్తి చెక్పోస్టులో రూ.7 లక్షలు స్వాధీనం
Published Sat, Nov 14 2015 1:20 PM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM
Advertisement
Advertisement