![Dwakra Communities Strengthened With The Support Of CM Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/29/28ERK01-290084_27_12.jpg.webp?itok=1WxdW9yF)
సాక్షి, నెట్‌వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్.. ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా ఆయుష్షు పోశారని మహిళలు కొనియాడారు.
గురువారం అనంతపురం జిల్లా గుంతకల్లులోని మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి మహిళా సంఘాల సభ్యులకు చెక్కు అందజేశారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్, కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి చెక్కులు అందజేశారు.
ఏలూరు జిల్లా కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు చెక్కులు పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం బోగోలులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తేనే సమాజాభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment