సాక్షి, కోనసీమ జిల్లా: ప్రభుత్వంపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మండపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాలు అభినందించాయి. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు.
‘‘ఏరోజైనా చంద్రబాబు పేదవాడికి సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా?. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మహానేత వైఎస్సార్. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. గడపగడపకూ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలన గురించి అడగండి. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి’’ అని తోట హితవు పలికారు.
చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా?
‘‘మండపేటలో టీడీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం దోచుకున్నారో చర్చకు నేను సిద్ధం. ఇసుకను ఎవరు దోచేసుకున్నారో ప్రజలే చెబుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరింది. ఆనాడు పెన్షన్లు మీ హయాంలో ఎలా వచ్చాయి.. ఇప్పుడు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందుతోంది. వలంటీర్లు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వలంటీర్లు ప్రజలకు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులకు కూడా లేని అనుభవం క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు ఉంది’’ అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment