
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని హల్‌చల్ చేసింది. పాఠశాల భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఎంతో రిస్క్ చేసి పోలీసులు ఆమెను కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మండపేట శశిస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. సోమవారం సాయంత్రం పాఠశాల భవనం 5వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
కాగా, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేయనే కారణంగా ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయబోయింది. దీంతో, హుటాహుటిన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసులు.. ఆమె వద్దకు వెళ్లి మార్కుల విషయం సముదాయించి.. చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment