మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు.
పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment