koteswari
-
స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి
మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
23 నుంచి ‘కోటీశ్వరి’ వచ్చేస్తోంది..
సాక్షి, చెన్నై: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీ చానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు. పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్లైన్లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్
తమిళసినిమా (చెన్నై): సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుంటారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ నటులను కలసి, మాట్లాడాలని చెబుతుంటారు. కొందరు నటులు అభిమానుల చివరి కోరిక తీరుస్తుంటారు. అలాంటివారిలో విజయ్, ఆర్య ముందు వరుసలో ఉంటారు. తాజాగా నటుడు ధనుష్ అలాంటి ఆనందాన్నే ఒక చిన్నారికి మిగిల్చారు. కోటేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతూ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ బాలిక చివరి కోరిక తన అభిమాన నటుడు ధనుష్‌ను చూడాలన్నదే. దీన్ని తెలుసుకున్న ధనుష్ గురువారం ఆస్పత్రికి వెళ్లి కోటేశ్వరిని పరామర్శించి అక్కున చేర్చుకున్నాడు. దీంతో బాలిక మృత్యువునే జయించినంతగా ఆనందపడిపోయింది.