చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్ | Last child Desire prove the Dhanush | Sakshi
Sakshi News home page

చిన్నారి చివరి కోరిక తీర్చిన హీరో

Published Fri, Jul 29 2016 1:40 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్ - Sakshi

చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్

తమిళసినిమా (చెన్నై): సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుంటారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ నటులను కలసి, మాట్లాడాలని చెబుతుంటారు.  కొందరు నటులు అభిమానుల చివరి కోరిక తీరుస్తుంటారు. అలాంటివారిలో విజయ్, ఆర్య ముందు వరుసలో ఉంటారు. తాజాగా నటుడు ధనుష్ అలాంటి ఆనందాన్నే ఒక చిన్నారికి మిగిల్చారు. కోటేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతూ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ బాలిక చివరి కోరిక తన అభిమాన నటుడు ధనుష్‌ను చూడాలన్నదే. దీన్ని తెలుసుకున్న ధనుష్ గురువారం ఆస్పత్రికి వెళ్లి కోటేశ్వరిని పరామర్శించి అక్కున చేర్చుకున్నాడు. దీంతో  బాలిక మృత్యువునే జయించినంతగా ఆనందపడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement