మెదక్: అభివృద్ధిలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తాం.. కౌడిపల్లి, రామాయంపేటలో డిగ్రీకళాశాలు ఏర్పాటు చేస్తాం.. టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లతో పాటు పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ, ఎస్పీ, సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీరుస్తామన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని, కౌడిపల్లికి, రామాయంపేటకు డిగ్రీకళాశాలలను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం తదితర ప్రదేశాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తునట్లు వెల్లడించారు. అలాగే మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసి వేద్దామంటున్నారు. మీరేమంటారని సీఎం ప్రశ్నించడంతో వద్దూ వద్దూ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పద్మా నా బిడ్డ..
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నా కూతురులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రగతిలో మెదక్ జిల్లాను మెరిపిస్తామన్నారు. మరి మీరు మాత్రం గతంలో కన్నా అధిక మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది.
Comments
Please login to add a commentAdd a comment