
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహా కూటమితో పొత్తు అనంతరం తమ పార్టీ నుంచి మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తొలి దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన జాబితాను మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విడుదల చేసింది. ఈ లిస్టులో అత్యాచార ఆరోపణలు ఎదర్కొంటున్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్‌లను ఆర్జేడీ నిరాకరించింది. వారి స్థానంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారి భార్యలను నామినేట్ చేసింది. చదవండి : బిహార్ ఎన్నికలు.. ఆర్‌జేడీకి భారీ షాక్
మైనర్ బాలికపై అఘాయిత్సానికి పాల్పడిన నేరంలో రాజ్ బల్లాబ్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉండటంతో ఆయన భార్య విభ దేవి.. నావాడా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. మరో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ యాదవ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉండి సంవత్సరం నుంచి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి కిరణ్ దేవి భోజ్‌పూర్ జిల్లాలోని సందేశ్ అసెంట్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మహా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతుంది. చదవండి : సోలోగా ఎల్‌జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment