అగర్తలా/న్యూఢిల్లీ: త్రిపురలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 76% పోలింగ్ నమోదైందని, 25.73 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మొ త్తం 60 శాసనసభా స్థానాలకు గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చరిలాం నియోజకవర్గం అభ్యర్థి రామేంద్ర నారాయణ్ దేబ్ ఆకస్మిక మృతితో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 91.82% పోలింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వా త కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి కనిపించారనీ, ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయనీ చెప్పారు. పోలింగ్ బందో బస్తు కోసం 300 కంపెనీల భద్రతా బలగాలను వినియోగించారు. నాలుగు పర్యాయాలుగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎం ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment