
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇషాక్ బాషా సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి తన పేరును ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా ఉన్నారు.
చదవండి: టీడీపీ నేతలకు తమ్ముళ్ల షాక్.. సాక్షి కథనం.. నిజం
Comments
Please login to add a commentAdd a comment