
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కుమారుడు తోట పృద్వీరాజ్ కూడా ఉన్నారు.
కాగా, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు.
అంతకుముందు.. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు.
చదవండి: కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ
నూతన విద్యా విధానంతో ఎనలేని మేలు: సీఎం జగన్