
పట్నా : బిహార్‌లోని దర్బంగాలో ప్రచార వేదిక కూలిపోవడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న జేల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మాని కిందపడిపోయారు. ఉస్మాని సహా వేదికపైన ఉన్నవారంతా స్టేజ్ కూలిపోవడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైన సమాచారం వెల్లడికాలేదు. ఈ ఘటనకు సంబంధించి బయటకువచ్చిన వీడియోలో ఉస్మాని మాస్క్ లేకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనిపించారు.
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ ఎంఎల్, సీపీఎం, సీపీఐలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా జట్టు కట్టి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తలపడుతోంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ ఇప్పటికే ముగియగా, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో మలి, తుది విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి : ఆటవిక రాజ్య యువరాజు