ఒడిశాలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 147 మంది సభ్యులున్న అసెంబ్లీకి నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతోంది. మే 13న నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలలోని తొలి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ మే 20న, మూడో దశ ఓటింగ్ మే 25న, నాలుగో దశ జూన్ ఒకటిన జరగనుంది. కాగా సోరో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ చివరి క్షణంలో మార్చింది.
బాలాసోర్ జిల్లాలోని సోరో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన మంగళవారం నాడు బీజేపీ తన అభ్యర్థిని మార్చింది. తొలుత అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజేంద్ర కుమార్ దాస్ స్థానంలో పరశురామ్ దాదాను నిలబెట్టింది. కాగా దాస్, దాదా ఇద్దరూ బీజేపీ అభ్యర్థులుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దాదా నామినేషన్‌ను పార్టీ ధృవీకరించింది.
బీజేపీ ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్ విజయ్ పాల్ సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సోరో అభ్యర్థిగా పరశురామ్ దాదా పేరును ధృవీకరించిందని తెలిపారు. 2014, 2019లో బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థిగా సోరో నుండి దాదా రెండుసార్లు గెలిచారు. ఆయన గత నెలలో బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment