
సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి లోక్‌సభకు ఎన్నిక అనివార్యమైంది.
చదవండి:
విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి