tirupati by poll
-
తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ
సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి లోక్‌సభకు ఎన్నిక అనివార్యమైంది. చదవండి: విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి -
తిరుపతి ఉప ఎన్నిక; రెండోస్థానానికి పోటాపోటీ
సాక్షి, తిరుపతి : పంచాయతీ.. మున్సి‘పోల్స్’ఫలితాలే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ పునరావృతం అవుతాయని నిర్ధారించుకున్న టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు ఆ పోరులో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్నాయి. అందుకు శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అరాచకాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు కుట్రలకు తెరతీస్తున్నాయి. ఇందుకోసం కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇరు పార్టీల అధినేతలు తమతమ శ్రేణులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ సమావేశం కొంత హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో టీడీపీ కార్యకర్తలు నాయకత్వ లోపంపై ఫిర్యాదు చేసినా.. అధినేత చంద్రబాబు అవేవీ పట్టించుకోలేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే సమయమిది కాదంటూ కార్యకర్తలను మందలించినట్లు తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పరువుపోయిందని.. తిరుపతి ఉప ఎన్నికలో అయినాసరే కనీసం రెండో స్థానం దక్కించుకునేందుకు పోరాడాలని చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ‘మనకు జనసేన మద్దతు ఉంటుంది. అయితే, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడండి. జనసేన కార్యకర్తలతో మంచిగా మెలగండి’.. అని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అరాచకాలకు కమలనాథుల కుట్రలు ఇక ఈ పోరులో ద్వితీయ స్థానం దక్కేలా కృషిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. తిరుపతిలో శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఉప ఎన్నికల్లో పరువు పోకుండా ఉండాలంటే ఏం చేయాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు. తనకు బాధ్యతలు అప్పగిస్తే శాయశక్తులా కృషిచేస్తానని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోము వీర్రాజుని కోరినట్లు తెలిసింది. అయితే, తాను చెప్పినప్పుడు కేంద్ర మంత్రులను తిరుపతిలో ప్రచారానికి పంపాలని కోరారు. అదే విధంగా అరాచకాలు, మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేశానని ఆయన తెలిపినట్లు సమాచారం. కానీ, కేసులు, అరెస్టులు లేకుండా బీజేపీ పెద్దలు బాధ్యతలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. దీంతో ఉప ఎన్నిక బాధ్యతను ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. చదవండి: తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర! టీడీపీలో తిరుపతి టెన్షన్: వరుస ఓటములతో కుంగిన క్యాడర్ -
తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ప్రధాన పోటీ ఉండే అవకాశముంది. -
నేడే తిరుపతి ఉప ఎన్నిక
-
తిరుపతి ఉప ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
బరిలో 13 మంది అభ్యర్థులు నగదు, మద్యంతో ప్రలోభాలు గెలుపుపై టీడీపీ, కాంగ్రెస్‌ల ధీమా తిరుమల: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైది. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ (టీడీపీ) 2014 డిసెంబర్ 15న అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2,94,781 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,886 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. పోటీలో దివంగత ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ సతీమణి సుగుణ (తెలుగుదేశం), ఆర్.శ్రీదేవి (కాంగ్రెస్), ఆసాది వెంకటాద్రి (రాష్ట్రీయ క్రాంతికారి సమాజ్‌వాదీ పార్టీ), కల్లూరి బాలసుబ్రహ్మణ్యం (లోక్‌సత్తా), నాగవేటి సుబ్రహ్మణ్య ఆచారి (అఖిల భారతీయ జనసంఘ్)తో పాటు మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రలోభాల పర్వం కనిపించింది. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు నగదు, మద్యం పంపిణీపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఉప పోరులో గెలుపుపై టీడీపీ ధీమాగా ఉంది. -
స్వగ్రామంలో సీఎం సంబరాలు
ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముక్తసరి ప్రసంగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారి పల్లెలో బుధవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి పండుగ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బాబు.. దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత చంద్రబాబు తల్లిదండ్రులు.. అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధులకు పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉండడం వల్ల తాను ఏమీ మాట్లాడలేనని పేర్కొంటూ సీఎం ముక్తసరిగా ప్రసంగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల జీవితాల్లో ఈ సంక్రాం తి.. సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంతో ముచ్చటించారు. సంబరాల్లో పాల్గొన్న విద్యుత్ కార్మికుల విశ్రాంత సంఘం నేతలు తమ సంఘం తరఫున రూ.1.11 కోట్ల డీడీని హుద్ హుద్ తుపాను బాధితుల సాయం కోసం సీఎంకి అందజేశారు. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా టీడీపీ కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం. సుగుణమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, జిల్లాలో టీడీపీ పరిస్థితిపై వారితో సమీక్షించారు. దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మనే ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిగా దించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అనంతరం తిరుపతి టీడీపీ అభ్యర్థి ఎం. సుగుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్త దివంగత వెంకటరమణ ఆశయాలకోసం పనిచేస్తానన్నారు. ఉప ఎన్నికలో తనకు సహకరించాలని, అన్ని పార్టీలను కోరనున్నట్లు తెలిపారు. నేడు మంత్రి బొజ్జలకు సీఎం పరామర్శ ఇటీవల పితృ వియోగం చెందిన రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీఎం పరామర్శిం చనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు నారావారి పల్లె నుంచి హెలీ కాప్టర్లో బయలుదేరి మంత్రి బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరుకు చంద్రబాబు చేరుకుంటారు. కొద్దిసేపు బొజ్జలను పరామర్శించనున్నారు. అనంతరం, అదే హెలీకాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.