తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది.
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో లెక్కంపు పూర్తవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ప్రధాన పోటీ ఉండే అవకాశముంది.