కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఈసారి బ్రాహ్మణ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్థులుగా కుమార్ విశ్వాస్, బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే పేర్లు వినిపిస్తున్నాయి.
రాయ్‌బరేలీ, అమేథీలను యూపీలో కాంగ్రెస్‌కు కంచుకోటలుగా పరిగణిస్తారు. అయితే 2019లో అమేథీ నుంచి బీజేపీ తన అభ్యర్థిగా స్మృతి ఇరానీని పోటీకి దింపి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టింది. రాయ్‌బరేలీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదేస్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ రాయ్‌బరేలీ నుంచి ప్రముఖుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది.
కుమార్ విశ్వాస్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై అమేథీ నుంచి పోటీ చేశారు. విశ్వాస్‌ను ఎన్నికల్లో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమార్ విశ్వాస్ ప్రసంగం ఆయన బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సూచనలిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ద్వారకలో పర్యటించినప్పుడు ఆయనను కుమార్ విశ్వాస్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment