
త్వరలో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు. శ్రీగంగానగర్ జిల్లాలోని శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఈయన ఎన్నికల బరిలో నిలిచారు. గుర్మీత్ సింగ్ కున్నార్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
గుర్మీత్ సింగ్ కున్నార్ కుమారుడు రూబీ కున్నార్ తండ్రి మరణవార్తను మీడియాకు తెలిపారు. 75 ఏళ్ల గుర్మీత్ సింగ్ కున్నార్ అనారోగ్యంతో నవంబర్ 12న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. గుర్మీత్ సింగ్ మృతితో కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్దతుదారుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నికలకు ముందు అభ్యర్థి మృతి చెందడంతో శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబరు 25న జరగాల్సిన పోలింగ్ వాయిదా పడింది
శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పృథిపాల్ సింగ్ సంధు రెండో స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన సురేంద్ర పాల్ సింగ్ టీటీ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ ముగ్గురూ మళ్లీ ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధం అయ్యారు. కాగా సంధు ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
Comments
Please login to add a commentAdd a comment