రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి కూడా ఓటర్లు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అధికార పీఠాన్ని మరో పార్టీకి అప్పగించారు. కాంగ్రెస్ ఓటమిపాలైంది. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 199 స్థానాలకు 115 సీట్లు గెలుచుకుని బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 69 స్థానాలకే పరిమితమైంది. దీంతో పాటు మూడు స్థానాల్లో భారత్ ఆదివాసీ పార్టీ, రెండు స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ, ఒక స్థానంలో రాష్ట్రీయ లోక్‌దళ్, ఒక స్థానంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, ఎనిమిది స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు.
ఈసారి ఫలితాలు చారిత్రాత్మకమైనవని చెబుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తక్కువ సంఖ్యలోనే మహిళలు విజయం సాధించారు. ఫలితాల అనంతరం 16వ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 20కి తగ్గగా, అవుట్‌గోయింగ్ అసెంబ్లీలో 23 మంది ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా సభకు ఎన్నికయ్యారు.
మొత్తం 50 మంది మహిళా అభ్యర్థులు ఈసారి జరిగిన ఎన్నిల బరిలో నిలిచారు. వీరిలో 20 మంది బీజేపీకి చెందినవారు కాగా, 28 మంది కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కేవలం 18 మంది మహిళలు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో బీజేపీ 23 మంది, కాంగ్రెస్ 27 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది అభ్యర్థులు, బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ)కి చెందిన ఒకరు, ఒక స్వతంత్ర మహిళా అభ్యర్థి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ తీన్మార్
Comments
Please login to add a commentAdd a comment