రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే రాష్ట్రంలో కొన్ని వీవీఐపీ సీట్లపైనే అందరి చూపు నిలిచింది.
దిగ్గజ నేతలు వసుంధర రాజే(బీజేపీ), అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్), రవీంద్ర సింగ్ భాటి(స్వతంత్ర అభ్యర్థి) సహా పలువురు వీఐపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదేకోవలో సతీష్ పునియా(బీజేపీ), దియాకుమారి(బీజేపీ), రాజ్యవర్ధన్ రాథోడ్(బీజేపీ) కూడా ఉన్నారు. అశోక్ గెహ్లాట్ సర్దార్‌పురా స్థానం నుంచి ఆరోసారి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 5.25 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజస్థాన్‌లోని 199 స్థానాలకు 1,863 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసుగల 1,70,99,334 మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 18-19 ఏళ్లలోపు 22,61,008 మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: వందలమందికి ప్రాణంపోసిన ‘రక్తవీర్’
Comments
Please login to add a commentAdd a comment