![Budi Mutyala Naidu As Anakapalle YSRCP Mp candidate - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/ysjagan.jpg.webp?itok=tDI-yW6N)
అభ్యర్థుల జాబితాలో పెండింగ్ స్థానం భర్తీ
అన్ని పార్టీల కంటే ముందున్న వైఎస్సార్‌సిపి
175/175 అలాగే 25/25 అభ్యర్థుల ఖరారు
ముత్యాలనాయుడుకు ప్రమోషన్
మాడుగులలో ముత్యాల కూతురు
సాక్షి, గుంటూరు: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె.
గత ఎన్నికల ఫలితాలేంటీ?
మాడుగుల స్థానంలో పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment