divya vani
-
Telangana: కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
-
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. -
Hyderabad: ఈటల రాజేందర్‌తో భేటీ.. బీజేపీలోకి దివ్యవాణి?
సాక్షి, హైదరాబాద్: మాజీ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేంద్రను గురువారం శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో దివ్య వాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. చదవండి: (ఈటలపై సస్పెన్షన్ వేటు?) -
Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే బయటకు వచ్చేశానన్నారు. ఈ మేరకు దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన నాకు అన్యాయం చేశారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుంది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నాని' దివ్యవాణి అన్నారు. చదవండి: (CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
నేను కూడా అలా బరస్ట్ అవుతానని అనుకోలేదు
-
నాకు పార్టీ లో విలువ లేకుండా చేసింది వాళ్ళే
-
ఏడాదిగా పార్టీలో నాకు ప్రాధాన్యత తగ్గించారు
-
చంద్రబాబును కలిసిన దివ్య వాణి
-
దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!
‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్లో ఈ చిత్రం ఆడాలి’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో ‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా. నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో కనిపిస్తా’’ అని దివ్యవాణి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి. -
పెళ్లి పుస్తకం @ 25
ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి... ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి... శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' చిత్రరాజానికి నేటికి అంటే ఏప్రిల్1వ తేదీకి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1991 ఏప్రిల్ 1న టాలీవుడ్లో విడుదలై ఈ చిత్రం ఓ చరిత్ర సృష్టించింది. హీరోహీరోయిన్లుగా నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ కృష్ణమూర్తిగా అలియాస్ కేకేగా... దివ్యవాణి సత్యభామగా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. అయితే గతంలో వచ్చిన చిత్రాలు... అంటే మిస్సమ్మ (పాతది) లో ఉద్యోగం కోసం ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలుగా కలసి నటిస్తే... అందుకు విరుద్ధంగా పెళ్లి పుస్తకం చిత్రంలో మాత్రం రాజేంద్రప్రసాద్, దివ్యవాణి పెళ్లి చేసుకుని... ఉద్యోగం కోసం ఇద్దరు శ్రీధరరావు పాత్రలో లీనమైన గుమ్మడి వెంకటేశ్వరరావు కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగాన్ని కృష్ణమూర్తి.... అదే సంస్థలో పీఏ ఉద్యోగాన్ని సత్యభామా సంపాదించి ఒకరి గురించి ఒకరికి తెలియనట్లు ఆయా పాత్రలో జీవించారు. కంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ.. అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌లో మాట్లాడుతుంటే... రావి కొండలరావు మాత్రం అదే సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ ... బధిర వార్తల చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఒకానొక సమయంలో హీరోయిన్ దివ్యవాణి చేత ఇస్త్రీ పెట్టితో వాత కూడా పెట్టించుకుంటాడు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేక సుధాకర్ విషయానికి వస్తే... గుమ్మడి బావమరిదిగా నటిస్తూ... దివ్యవాణిపై మనసు పడి... ఆ తర్వాత అక్కతో కొట్టింగు పడే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి. ఇక సెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి... అతడి భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తూంది... లాంటి డైలాగులు ఎన్నో ప్రేక్షక దేవుళ్ల చేత చపట్లు కొట్టించాయి. పాటలు అయితే ఇక చెప్పనక్కరలేదు. ఆరుద్ర గారి చేతి నుంచి జాలు వారిన శ్రీరస్తూ...శుభమస్తూ పాట అప్పటి వరకు తెలుగు ప్రజల లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా భజింత్రులు మోగిన... వినిపించే సీతారాముల కళ్యాణం చూతమురారండి అంటూ సాగే పాటను పక్కకు నెట్టింది. శ్రీరస్తూ... శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది ...అంటూ సాగే పాట ఆఖరికి టీవీ సీరియళ్లలో వచ్చే పెళ్లీ సీనుల్లో ఈ వినిపిస్తూంది. మామా కె.వి. మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన అమ్మకుట్టి అమ్మ కుట్టి మనస్సు లోయో..... , కృష్ణం కలయసఖి సుందరం.... , పపపప పప పప్పు దప్పళం అన్నం నెయ్యి..., హాయి హాయి శ్రీరంగ సాయి..., సరికొత్త చీర ఊహించినాను.... పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు, సంగీత ప్రియులను ఒలలాడించింది. పెళ్లికి అర్థాన్నీ, పరమార్దాన్నీ ఇంత సున్నితంగా, హృద్యంగా అందంగా ,రొమాంటిగ్గా అన్నింటినీ మించి హాస్య భరితంగా చెప్పిన చిత్రం ఈ పెళ్లి పుస్తకం. శ్రీసీతారామా బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.