తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష.. అసెంబ్లీ ఎన్నికలు. ఈరోజు(నవంబర్ 30న) తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అంతటా 50 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా హైదరాబాద్, రంగారెడ్డి మాత్రం పోలింగ్‌లో వెనకబడ్డాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం.
మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోండని చెప్తూ లైన్లలో నిలబడి మరీ ఓటేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్‌బాబు, వెంకటేశ్, రానా, అల్లుఅర్జున్, నాని.. ఇలా పలువురు సినీతారలు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అని అడిగాడు.
దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ... 'ఏమంటామండీ.. ఓటు హక్కు ఉపయోగించుకోలేనివాళ్లు అంటాం' అని తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు.. పోలింగ్ బూత్ వద్ద కూడా కామెడీ పండిస్తున్నాడు మహానుభావుడు అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Legend 🔥😂 #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw
— Narasimha (@_narasimha___) November 30, 2023
చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్.. తదితర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment