జంగ్ తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్ అప్‌డేట్స్
కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- రేపటి కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- హ్యట్రిక్ లోడింగ్ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి..
- గెలుపుపై ధీమా
Hattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
రంగారెడ్డి:
- ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
- 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కిపంపించని అధికారులు..
- విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
- కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు
- పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు
- పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం
- ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత
- కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్
- ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్
- గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత
గజ్వేల్ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
- రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్
- ఉదయం 10గం. తొలి ఫలితం వెల‍్లడయ్యే అవకాశం
- గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి
- పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది) ఉండడమే కారణమన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
- రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చనే అంచనా
- 23 రౌండ్లలో కౌంటింగ్
- ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తైందన్న కలెక్టర్
చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క
- ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు
- నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు
- చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు
- నా జీవితానికి ఇంకేం కావాలి
- నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు
- నేనెప్పుడూ మీ సేవకు రాలినే
- నేను ములుగు ప్రజల వెంటే..
- కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను
- నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా
- వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు
- ఆడబిడ్డ ఉసురు తగులుతుంది
- మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు
- నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు
- ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా
- పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా
- ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు
- వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా..
కేసీఆర్‌కు బైబై చెప్తున్నారు: షర్మిల
- ఫలితాల ముందర.. వైఎస్సార్‌టీపీ నేత షర్మిల స్పందన
- తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని కామెంట్
- బైబై కేసీఆర్ సూట్‌కేసును ప్రదర్శించిన షర్మిల
- కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు
- ఉత్తమ్, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు
- బ్లాక్‌మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు
- సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు
సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నేత ఉత్తమ్..
- బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు
- రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది
- రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు
- భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది
- రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు
- అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం
- ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం
- ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం
- మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం
రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం..
- ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
- కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు
- కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు
విజయావకాశాలపై వీహెచ్ స్పందన
- తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలపై సీనియర్ నేత వీహెచ్ స్పందన
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది
- దళితబంధు, డబుల్ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు
మై హీరో: కవిత ట్వీట్
- మై హీరో అంటూ తండ్రి కేసీఆర్ వీడియోను షేర్ చేసిన కవిత
My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023
ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు
- తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
- ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్, పొంగులేటి
- బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు
- డిసెంబర్ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్ భేటీపైనా ఫిర్యాదు
- ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ కీలక భేటీ
- హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు
- రాష్ట్ర ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు..
- కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ
- కౌటింగ్ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్
ఎల్బీ నగర్ ఏర్పాట్లు ఇలా..
- రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
- ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు
- ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ
- మూడంచెల భద్రత నడుమ ఇండోర్ స్టేడియం
- ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు
- కౌటింగ్ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు
కౌంటింగ్.. కౌంట్‌డౌన్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
- రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్
- ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్‌లు
- తొలి అరగంట బ్యాలెట్.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్
- పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు
- కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు
అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
- రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్
- అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశం
- కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
- పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం
- అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత
- నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు..
- రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
- ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు
- పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు
- మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు
- కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్‌లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్
- ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్
- పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్
- అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్
- భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్
- జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్
- జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు
- జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 80.13 శాతం పోలింగ్ నమోదు
- కౌంటింగ్ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది
క్లాస్ ఓటు బీఆర్‌ఎస్‌కే: పోచారం
- బీఆర్‌ఎస్ విజయావకాశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందన
- బీఆర్‌ఎస్‌కు 70-75 సీట్లు పక్కా
- మాస్-క్లాస్ ఓటర్ల పల్స్ వేరు
- క్లాస్ ఓటర్లంతా బీఆర్‌ఎస్ వైపు ఉన్నారు
- సైలెంట్ ఓటు KCRకు అనుకూలంగా ఉంది
- కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా..
- కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్..
- కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు
- కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు
- మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు
- చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు
- హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు...
- బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు..
- వేములవాడ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్
- సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు 21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు.
- పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు..
- మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు
- రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు
- పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్.
- పెద్దపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు
- మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు
- పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు
- జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు
- జగిత్యాల నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు
- పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు
- కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్
- ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- పొస్టల్ బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు
బెట్టింగ్‌లో పొలం కూడా..?
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు
- అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్
- యాప్‌ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా
- సిర్పూర్‌లో లక్షల్లో బెట్టింగ్
- డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు
- తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి!
బీజేపీ ధీమా ఏంటంటే..
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి
- పోలింగ్ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు
- ఆ స్టేట్‌మెంట్‌తోనే అగ్రనేతల హడావిడి
- ఎగ్జిట్‌పోల్స్‌తో ఢీలా పడ్డ పార్టీ కేడర్
- తాజాగా బీజేపీ మరో ధీమా
- 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్‌మెంట్లు
- ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా
- 2018లో కేవలం 14 లక్షల ఓట్లు
- ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా
..అయినా బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళనే!
- తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
- భవితవ్యంపై టెన్షన్ పడుతున్న అభ్యర్థులు
- ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ధీమా
- నిన్న ప్రగతి భవన్‌లో నేతలతో సమావేశం
- వార్ రూమ్ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ
- బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపించిన కొందరు నేతలు
- హైదరాబాద్ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు
- నేతల అధైర్యంతో.. కేడర్‌లోనూ ఆందోళన
- సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం?
- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్
10:06AM
రేపు కాంగ్రెస్ బిగ్ ప్లాన్
- రేపు డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి
- అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ
- రేపు కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు
- గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్ తాజ్‌కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు
- మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్
- ఇవాళే హైదరాబాద్‌కు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్
- ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్‌కే అప్పగించిన అధిష్టానం
హమ్మయ్యా.. ఇక రిలాక్స్
- తెలంగాణలో రిలాక్స్ అవుతున్న పొలిటీషియన్స్
- ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ
- రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం
- అలసిపోయిన లీడర్లు
- పోలింగ్ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం
- కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్ అవుతున్న నేతలు
- రేపు ఎలాగూ కౌంటింగ్ టెన్షన్
గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా..
- ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
- తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం
- శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత
- నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
- ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు
- పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు
- 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు
- ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్
- పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్
- మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో 19 రౌండ్స్ లో కౌంటింగ్
- వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్
- సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్
- జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్
- 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు
- జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు
- జిల్లా లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు
కేసీఆర్‌పై నమ్మకం ఉంది
- సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పలువురి పోస్టులు
- కేసీఆర్‌పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు
- ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్‌ఎస్ శ్రేణులు
- ఇప్పటికే ప్రగతి భవన్ మీటింగ్ ధైర్యం నూరిపోసిన కేసీఆర్ అండ్ కేటీఆర్
- ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా
- ఎగ్జిట్ పోల్స్ చెత్త అంటూ ఖండన
- ఎగ్జాక్ట్(కచ్చితమైన) పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు
- అదే సమయంలో కేసీఆర్, బీఆర్‌ఎస్ సర్కార్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు
- రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం
09:40 AM
20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్
- మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు
- ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం
- మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342
- పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు
- మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు
- మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్
- ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం
- మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం
- 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్!
- మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం
09:23 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
- రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు
- ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం
- 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి
- 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు.
- ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు.
- ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు
09:15 AM
కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు
- తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు
- పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా
- ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్
- హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు
- ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్
07:59 AM
తెలంగాణ ఫలితాలు.. కాయ్‌రాజా కాయ్!
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు?
- ఏపీలోనూ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం
- గెలుపుపై అన్ని పార్టీల ధీమా
- ఎగ్జిట్‌పోల్స్ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్ సొమ్ము
- ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్ వేయాలంటూ జోరుగా పందేలు
- సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ..
- కీలక నేతల గెలుపోటములపైనా భారీగా..
- కీలక నేతల మెజార్టీ ఫిగర్‌పైనా బెట్టింగులు
- బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నజర్
07:31 AM
- ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా?
- ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు
- కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి
- పోలింగ్ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ
- కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్‌ఎస్
- ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో.. కాంగ్రెస్ సంబురాలు
- అధైర్య పడొద్దంటూ బీఆర్‌ఎస్ కేడర్‌కు కేసీఆర్ ధైర్యం
- ఎగ్జిట్‌పోల్స్‌ను రబ్బిష్ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్
- ఎగ్జిట్ పోల్స్‌ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన
- ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు
07:22 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి కౌంటింగ్ ఇలా..
- ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు
- నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా..
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు
- ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
- మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు
- నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ , ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధింపు
- ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం
7:16 AM
కాంగ్రెస్ గెలవబోతోంది: రేవంత్‌రెడ్డి - ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్
- ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా
- విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఇంటికి క్యూ
- ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచన
- 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు
- నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతల బృందం
- ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు
07:09 AM
పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్: సీఈవో వికాజ్‌రాజ్ - స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలు
- మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో
- రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
- అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్
- పోలింగ్ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు
- స్ట్రాంగ్‌రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు
- సీసీ కెమెరాలు ఏర్పాటు
- 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు
- కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు
- ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్14
- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ
- ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది
- జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున
- పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు..
- పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం
- ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం
- పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు
07:00 AM
మళ్లీ హైదరాబాద్‌కు డీకేఎస్ - మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- కౌంటింగ్.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్‌కు
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా డీకేఎస్‌ను నియమించిన ఏఐసీసీ
- రిసార్ట్ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్
06:57 AM
ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా
- పార్టీ కేడర్‌ను ధైర్యం నూరిపోసిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
- ప్రగతి భవన్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ
- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా
- ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం
- చివరి గంటలో జరిగిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్ అభిప్రాయం
- ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించిన పలువురు నేతలు
- డిసెంబర్ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీకి సీఎం కేసీఆర్ నిర్ణయం
06:54 AM
నగరంలో రేపు అక్కడ ఆంక్షలు - ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు
- ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లు
- ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
- మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదు
- విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు
- రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం
- ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్
06:40 AM
రేపే కౌంటింగ్.. - తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
- ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్
- మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ
- తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
- ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ
- వన్ సైడెడ్‌గా ఎగ్జిట్ పోల్స్
- అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా
06:38 AM
అత్యల్పంగా రాజధానిలోనే.. - పోలింగ్ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు
- జిల్లా వారీగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్
- కేవలం 47.88 శాతం మాత్రమే
- రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్
- మలక్‌పేట్‌లో 41.32 శాతం,
- చార్మినార్‌లో 43.27 శాతం,
- చాంద్రాయణగుట్టలో 45.26 శాతం
- బహదూర్ పురాలో 45.50 శాతం,
- జూబ్లీహిల్స్ లో 47.49 శాతం,
- అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం,
- ఎల్బీనగర్‌లో 49.07శాతం,
- కంటోన్మెంట్‌లో 49.36 శాతం పోలింగ్
- మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం,
- రంగారెడ్డిలో 59.94 శాతం,
- హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్
06:36 AM
పోలింగ్ ఇలా.. - రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది
- పోలింగ్ పాల్గొన్న 2,32,59,256 మంది
- ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో..
- .. 1,15,84,728 మంది పురుషులు,
- మహిళలు 1,16,73,722 మంది,
- ఇతరులు 806 మంది
- జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్
- నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్
- ఖమ్మం పాలేరులో 90.89,
- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్
06:32 AM
ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇలా.. - నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా..
- సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు
- అప్పటికే లైన్‌లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
- రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు
- ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
- తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం 71.34 శాతం
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 73.37 శాతం నమోదు
- గతంలో కంటే రెండు శాతం పోలింగ్ తగ్గింది
Comments
Please login to add a commentAdd a comment