
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపింది. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే మిగులుంది.
అక్టోబర్ 5న పార్టీ పేరు మార్పుపై ఈసీకి టీఆర్‌ఎస్ లేఖ పంపింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ గురువారం ఈసీ ఆమోదం తెలిపింది. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 1:20కి బీఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు.
చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment