భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సభా ఏర్పాట్లు
యాదాద్రి: బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల16న భువనగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్‌పై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో జరుగుతున్న తొలి బహిరంగసభను విజయవంతం చేయడానికి మున్సిపాలిటీలు, మండలాల వారీగా జనసమీకరణ చేయనున్నారు. అదే విధంగా జిల్లాలో భువనగిరితో పాటు ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నియోజకవర్గాల్లోనూ అధినేత బహిరంగ సభల తేదీలను ఖరారు చేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.
భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ
16వ తేదీన జగామ, భువనగిరిలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తొలుత జనగామలో ఆ తర్వాత భువనగిరి సభలో పాల్గొంటారు. భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేలకు పైగా జనాన్ని సమీకరించనున్నారు. ఇందుకు అనుగుణంగా 100 మంది కూర్చునేందుకు వీలుగా వేదిక, సభకు హాజరైన వారికి నీడ కోసం సూపర్ స్ట్రక్చర్ టెంట్లు, పండాలాలు ఏర్పాటు చేయనున్నారు.
సన్నాహక సమావేశాలు
ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు జన సమీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి, సాయంత్రం భువనగిరి మండల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం వలిగొండ, భువనగిరి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం బీబీనగర్ మండల సన్నాహక సమావేశం ఉంటుంది.
సభను విజయవతం చేయాలి
సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజైర విజయవంతం చేయాలి. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన మన నాయకుడు కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రజలకు అందజేస్తున్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి. సభకు వేలాదిగా ప్రజలు తరలిరావాలి. –ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment