సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడాన్ని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తోపన్నగండ తండాకు చెందిన బానోత్ ప్రేమ్‌నాయక్ తప్పుపట్టారు.
తాను ముందుగా భారతీయ రాష్ట్ర సమితితోపాటు మరో మూడు పేర్లతో దరఖాస్తు చేశానని.. కానీ తన తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా పేరుగా మార్చాలంటూ టీఆర్‌ఎస్ చేసిన దరఖాస్తుకు ఈసీ అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment