
ఢిల్లీ: ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ ఆఫీస్ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జెండా ఆవిష్కరించి బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ వెంట కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి.
జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు టీఆర్‌ఎస్ కాస్తా బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను పార్టీ ఆహ్వానించారు. కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు మరికొందరు నేతలను ఆహ్వానించారు. వీరితో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment