సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
కాగా, తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు. లిక్కర్ స్కాంలో మిగతా వారిని విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలి. గతంలో ఎన్నికల సంఘానికి నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందకు లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితలను అరెస్ట్ చేయాలన్నారు. బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే, బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత పేరును చేర్చినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment