సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడే అని నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, అలాంటిది ఆ రెండు పార్టీలు జతకట్టడం అనైతికమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు.
ఆ దాడులతో టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధ లేదు
రేవంత్‌రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం లేదని కవిత అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్‌లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment