
కర్నూలు కల్చరల్: సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చి బీఆర్‌ఎస్ అంటూ పగటి కలలు కంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పి అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మాట్లాడాలన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్... ఇప్పుడు ఆంధ్రా అంటూ కూని రాగాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నియంత్రణ చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు.